
అక్కినేని వారసుడు అఖిల్ తన రెండో సినిమా త్వరలో స్టార్ట్ చేస్తున్నాడు. విక్రం కుమార్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు తమిళ అమ్మాయి మేఘా ఆకాష్ ను అనుకున్నారు కాని అఖిల్ సినిమా లేట్ అవడం వల్ల ఈలోగా అమ్మడు వేరే సినిమాలకు కమిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు మళ్లీ అఖిల్ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్ భామలను టాలీవుడ్ తేవాలంటే భారీ పారితోషికం ఇవ్వాల్సిందే. ఆ లెక్కన్న అలియా కోసం ఎంత పెడతారో ఏమో.. ఇక అడిగినంత ఇచ్చినా అమ్మడు ఒప్పుకుంటుందా అన్నది కూడా ఆలోచించాలి. అందుకే బాలీవుడ్ కాంటాక్ట్స్ అన్ని ఉపయోగించి నాగార్జున అఖిల్ కోసం అలియాను దించుతున్నాడట. ఒకవేళ అలియా కన్ఫాం అయితే మాత్రం అఖిల్ పక్కన అలియాను చూసేందుకైనా ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూసేస్తారు.
విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 45 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబడుతుందని టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో సగం బడ్జెట్ ఫైట్స్ కోసమే కేటాయిస్తున్నారట. మొదటి సినిమా ఫ్లాప్ తో అఖిల్ తన సెకండ్ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.