
నందమూరి బాలకృష్ణ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. శాతకర్ణి తర్వాత కొత్త క్యారక్టర్ లో కనిపించబోతున్న బాలయ్య బాబుతో ఇద్దరు హీరోయిన్స్ రొమాన్స్ చేస్తారని తెలుస్తుంది. ఒక హీరోయిన్ గా అమలా పాల్ నటిస్తుందని టాక్. ఇప్పటికే పూరి డైరక్షన్ లో ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరోయిన్ గా చేసిన అమలా తెలుగులో రాం చరణ్, అల్లు అర్జున్ లతో నటించింది.
ఇక పెళ్లి తర్వాత కొద్దిరోజులు సినిమాలు చేయకున్నా విడాకుల తర్వాత ధనుష్ తో సినిమా చేస్తుంది అమ్మడు. ప్రస్తుతం బాలయ్య సినిమాలో హీరోయిన్ పాత్రకు అమలా కరెక్ట్ గా సూట్ అవుతుందని పూరి ఆమెతో చర్చలు జరుపుతున్నారట. ఇక ఆమె కాదంటే మాత్రం ఛార్మిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. మరి ఫైనల్ గా పూరి ఎవరిని బాలయ్య సరసన హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తాడో చూడాలి.