పవన్ కళ్యాణ్ ఆ సినిమా కష్టమే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి డైరక్షన్ లో నటించిన కాటమరాయుడు మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ సినిమా వీరం రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజే మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా కేవలం ఫ్యాన్స్ కే అన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. పవర్ స్టార్ రేంజ్ కు కలక్షన్స్ పర్వాలేదు అన్నట్టు ఉన్నా ఓవరాల్ గా మళ్లీ పవన్ నిరాశ పరిచాడనే మాట వాస్తవం.

ఇక ఈ సినిమా రిజల్ట్ తో తమిళ సినిమా వేదలం రీమేక్ గా నీశన్ డైరక్షన్ లో సినిమా చేయాలని ముహుర్తం పెట్టేసిన పవన్ మళ్లీ ఆలోచనలో పడ్డాడట. ఏ.ఏం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్. ఏప్రిల్ 6 నుండి త్రివిక్రం సినిమా షురూ చేస్తున్న పవన్ కళ్యాణ్ నీశన్ సినిమా నుండి వాకవుట్ చేసినట్టే అని అంటున్నారు. నీశన్ బదులు వినాయక్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట పవర్ స్టార్. కాటమరాయుడు ఫలితం పవన్ ఆలోచనల్లో మార్పులు తెచ్చింది. మరి నీశన్ సినిమా పవర్ స్టార్ చేస్తాడా లేడా అన్నదాని మీద అఫిషియల్ న్యూస్ ఇంకా బయటకు రాలేదు.