
వరుస ఫ్లాపుల్లో తన ఇమేజ్ సైతం కోల్పోయే పరిస్థితుల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు నేను శైలజ రూపంలో సూపర్ హిట్ అందించాడు డైరక్టర్ కిశోర్ తిరుమల. రామ్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన నేను శైలజ ఓ మంచి లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనసుని గెలుచుకుంది. ఆ సినిమాతోనే కీర్తి సురేష్ తెలుగులో హీరోయిన్ గా పరిచయమైందని తెలిసిందే.
ఇక ఆ సినిమా హిట్ తర్వాత రామ్ నటించిన హైపర్ అంచనాలను అందుకోలేదు. అందుకే మరోసారి నేను శైలజ డైరక్టర్ తోనే సినిమా తీస్తున్నాడు. హైపర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని కిశోర్ సినిమానే ఫైనల్ చేశాడు. స్క్రిప్ట్ కూడా కొత్తగా క్యారక్టర్ అన్ని చాలా లైవ్లీగా ఉంటాయని అంటున్నాడు డైరక్టర్ కిశోర్ తిరుమల. నేను శైలజ తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. రామ్ తో పాటు ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అప్పట్లో ఒకడుండేవాడు తో క్రేజ్ సంపాదించుకున్న శ్రీవిష్ణు కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడట.