
అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రారండోయ్ వేదుక చూద్దాం. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు ఉగాది కానుకగా రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
లాస్ట్ ఇయర్ ప్రేమంతో హిట్ అందుకున్న నాగ చైతన్య ఆ తర్వాత వచ్చిన సాహం శ్వాసగా సాగిపోతో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు రారండోయ్ వేడుక చూద్దాంతో రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. అన్నపూర్ణ బ్యానర్లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను హిట్ టార్గెట్ తో నిర్మిస్తున్నాడు. వరుస సక్సెస్ లతో ఫాంలో ఉన్న హీరోయిన్ రకుల్ అక్కినేని హీరోతో జతకడుతుండగా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.