
బాహుబలి సినిమా కోసం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంతో కష్టపడ్డారు. ఏకంగా సినిమా కోసం నాలుగేళ్లు టెక్నికల్ టీం కృషి చేయగా అందులో నటించిన నటీనటులు ఒక్క ప్రభాస్ తప్ప మిగతా వారంతా వేరే సినిమాలు చేశారు. బాహుబలి బిగినింగ్ లో ఉన్న అనుష్క సినిమా మొత్తం ఓల్డ్ గెటప్ లోనే కనబడ్డది. బిగినింగ్ అప్పుడే సెకండ్ పార్ట్ కు సంబందించిన ఎపిసోడ్స్ షూట్ చేశారట. ఇక మధ్యలో రెండేళ్లు గ్యాప్ రావడం అనుష్క కూడా వేరే సినిమాలు చేయడం జరిగింది.
సినిమాలు చేస్తే ఓకే కాని సైజ్ జీరో కోసం అమ్మడు పెరిగిన లావు బాహుబలి-2 కి సమస్యగా మారింది. మొదటి పార్ట్ లో అనుష్క తో చేసిన సీన్స్ లో అమ్మడు నాజూకుగా ఉంది కాని సైజ్ జీరో చేసిన తర్వాత ఆమె లావెక్కింది. ఎంత తగ్గినట్టు కనిపించినా మునుపటి సైజ్ కు మాత్రం చేరుకోవట్లేదు. అందుకే మొదటి పార్ట్ లో అనుష్క చేసిన అన్ని సీన్స్ రీ షూట్ చేశారట. ఈ ఖర్చు అంతా దాదాపు 20 కోట్లు అయ్యిందని టాక్. కొందరేమో కెమెరా టెక్నిక్ తో అనుష్క సైజ్ తగ్గించి చూపిస్తారని అంటుంటే మరికొందరేమో అనుష్క సీన్స్ అన్ని రీ షూట్ చేశారని అంటున్నారు. మరి వీటిలో నిజం ఏంటో తెలియాలంటే సినిమా చూస్తేనే కాని చెప్పలేం.