మహేష్ తోనే 'జనగణమన'..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ ఈమధ్య ఫ్లాపులు తీస్తున్నాడు కాని ఒకప్పటి అతనితో సినిమా కోసం స్టార్ హీరోలు కూడా క్యూలు కట్టేవారు. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరికి అవకాశం ఇచ్చేందుకు స్టార్ హీరోలు జంకుతున్నారు. పూరి డైరెక్ట్ చేసిన రోగ్ ఈ 31కి రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం బాలయ్యతో మూవీ చేస్తున్నాడు పూరి.

ఇక ఈ సినిమా తర్వాత హే భగవాన్ సినిమా చేస్తానని చెబుతున్నాడు పూరి. రోగ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన పూరి మహేష్ తో జనగణమన సినిమా తప్పకుండా చేస్తానని కాకపోతే అది ఎప్పుడు ఏంటి అన్నది కచ్చితంగా చెప్పలేమని అన్నారు. దేశభక్తి కథతో సాగే ఆ కథకు మహేష్ లాంటి సూపర్ స్టారే కరెక్ట్ అంటున్నాడు పూరి. టెంపర్ తర్వాత పూరి తీసిన సినిమాలన్ని ఫ్లాపులే రోగ్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. 

ఫ్లాపుల్లో ఉన్నా సరే పూరి డైరక్షన్ ప్రతిభ తెలుసు కాబట్టి బాలకృష్ణ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ గా ఉస్తాద్, టపోరి ఈ రెండిటిలో ఒకటి ఫైనల్ చేస్తారని టాక్.