తమిళ దర్శకుడితో ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో బాహుబలి బిగినింగ్ రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. ఇక బాహుబలి-2 కూడా ఏప్రిల్ 28న వచ్చేందుకు సిద్ధమవుతుంది. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ బాహుబలి-2 సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా నాలుగేళ్లు కేటాయించాడు. అందుకే అంతకంత క్రేజ్ సంపాదించాడు.  

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ సుజిత్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా 150 కోట్ల బడ్జెట్ తో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ తమిళ దర్శకుడు అత్లీతో సినిమా చేస్తాడని టాక్. ఇప్పటికే ప్రభాస్ కు ఓ అద్భుతమైన కథ కూడా వినిపించాడట అత్లీ. అంతేకాదు బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యాడు అత్లీ. సో తర్వాత సినిమా చేసే ఆలోచనతోనే అత్లీకి ఇన్విటేషన్ పంపించి ఉంటాడు ప్రభాస్. మరి ఈ ప్రాజెక్ట్ పై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.