
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు హడావిడి ఓ పక్క కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం థియేటర్ లో ఆ సినిమా సందడి చేస్తుంది. ఇక ఏమాత్రం గ్యాప్ లేకుండా త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు పవర్ స్టార్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 6నుండి ఈ సినిమ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట.
సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ఫైనల్ అవగా ఇప్పుడు సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టిని కన్ఫాం చేశారట. దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడైనా ఆది హీరోగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక లాస్ట్ ఇయర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడులో విలన్ గా విశ్వరూపం చూపించిన ఆది ఇప్పుడు పవర్ స్టార్ తో కూడా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పవన్ తో ఆది విలనిజం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. హీరో నుండి టాలీవుడ్ లో విలన్ గా టర్న్ తీసుకున్న ఆది ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న నిన్నుకోరి సినిమాలో కూడా నటిస్తున్నాడు.