శాతకర్ణి విషయంలో దేవి తప్పేం లేదట..!

నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన 100వ సినిమా ఏ రేంజ్ లో ఉండాలనుకున్నాడో బాలయ్య అలానే సినిమాతో ప్రేక్షకులను అభిమానులు అలరించాడు. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్రాధ్యాత వహించింది. అయితే ముందు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడని అన్నారు. కాని ఫైనల్ గా చిరంతన్ భట్  కూడా అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొట్టాడు. 

అసలు దేవి సినిమా నుండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందంటే తన బిజీ షెడ్యూల్ వల్లే అని తెలుస్తుంది. ఈ విషయం శాతకర్ణి డైరక్టర్ క్రిష్ బయట పెట్టడం విశేషం. దేవి సాధారణంగా తన మ్యూజిక్ అంతా చెన్నైలోనే కంపోజ్ చేస్తాడు. అయితే శాతకర్ణి సినిమాకు సమయం తక్కువగా ఉండటం వల్ల దేవి కి కుదరక శాతకర్ణి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో దేవికి వేరే సినిమాలు ఉండటం వల్ల శాతకర్ణి చేయడం కుదరలేదట. ఇక దేవి చేయకపోయినా కంచె సినిమా చేసిన పరిచయంతో చిరంతన్ భట్ కు అవకాశం ఇస్తే సినిమా మ్యూజిక్ కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడని అన్నారు క్రిష్.