
మెగా ఫ్యాన్స్ లో ఎవరికి వారు అన్న పరిస్థితులు ఏర్పడినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ చీలి పవన్ ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా వేరు కుంపటి పెట్టేసుకున్నారు. నిన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో అభిమానులు రాం చరణ్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకకు అల్లు అరవింద్ తో పాటుగా సుప్రీం హీరో సాయి ధరం తేజ్ అటెండ్ అయ్యాడు. మెగా ఫ్యాన్స్ లో ఏర్పడ్డ ఈ గ్యాప్ గుర్తించిన తేజ్ మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే అని.. అందరు కలిసి ఉంటేనే బలమని అన్నాడు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యాన్స్ గా కలిసి ఉండాలని కోరుకున్నారు తేజ్. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఏమి లేకపోయినా బన్ని అన్న ఒక్క 'చెప్పను బ్రదర్' అన్న మాట వల్ల పెద్ద దుమారం ఏర్పడింది. వారిద్దరు కలిసి కనిపిస్తే తప్ప ఈ గొడవకు ఎండ్ కార్డ్ పడేట్టు కనిపించట్లేదు.