బతుకమ్మకు పవన్ సందడి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి బతుకమ్మకు సందడి చేయడమేంటని టైటిల్ చూసి కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. ప్రస్తుతం థియేటర్లలో కాటమరాయుడిగా అభిమానులను ప్రేక్షకులను అలరిస్తున్న పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా సినిమా రిలీజ్ బతుకమ్మ పండుగకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమాలో ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా పవన్ కనిపించనున్నాడట. తను స్థాపించిన జనసేన పార్టీ తరపున 2019 ఎన్నికల్లో పూర్తిస్థాయిగా రాజకీయ ప్రచారంలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు పవన్, అందుకే కమిట్ అయిన సినిమాలన్ని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట. 

ఇక త్రివిక్రం సినిమా నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఏప్రిల్ లో స్టార్ట్ చేసి బతుకమ్మ పండుగ కల్లా సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఒకే ఏడాది పవన్ నుండి రెండు సినిమాలు అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. మరి అనుకున్న డేట్ కు పవన్ వస్తాడో రాడో చూడాలి.