సూపర్ స్టార్ 5 పాత్రల్లో..!

సూపర్ స్టార్ రజినికాంత్ సౌత్ ఇండియన్ సూపర్ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా 2.0 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నారు. ఇక సినిమాలో రజిని 5 డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నారట. రోబోలో వశీకర్, చిట్టి రెండు పాత్రల్లో నటించి మెప్పించిన రజినికాంత్ ఈసారి ఏకంగా 5 క్యారక్టర్స్ లో నటిస్తున్నారట.

ఈ ఐదు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తుంది. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగు హింది భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. 2017 దీపావళి కానుకగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు.