
పూరి జగన్నాధ్, బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఉస్తాద్, టపోరి టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో బాలయ్య బాబు గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడట. పూరి సినిమాల్లో హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో తెలిసిందే. ఆ క్రమంలో బాలకృష్ణ కోసం అదే రేంజ్ పవర్ ఫుల్ క్యారక్టర్ డిజైన్ చేశాడట పూరి.
హీరోయిన్ ఇంకా ఫైనల్ అవని ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ డేట్ కన్ ఫాం చేశారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి బాలయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పూరి డైరక్షన్ లో ఇషాన్ హీరోగా వస్తున్న రోగ్ ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమా రిజల్ట్ పూరి బాలకృష్ణ సినిమా మీద పడుతుందో లేదో చూడాలి.