
యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న శ్రీముఖి అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తుంది. మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత యాంకర్ గా తన చలాకీతనంతో ఆకట్టుకుంటున్న అమ్మడు సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్రకైనా సిద్ధం అని చెబుతుంది. ఇక ఈమధ్య ఓ ఐటం సాంగ్ లో కూడా అమ్మడు చిందులేస్తుందని టాక్ వచ్చింది.
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్. లావణ్య త్రిపాఠి, హెబ్భా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ హాట్ ఐటం ప్లాన్ చేశారట. ఈ సాంగ్ లో శ్రీముఖిని తీసుకునే ప్రయత్నం చేయగా వరుణ్ తేజ్ పక్కన హైట్ బాగా తక్కువవడం వల్ల శ్రీముఖిని ఆ సాంగ్ నుండి తప్పించారట. ఇక ఆమె బదులు బాహుబలిలో స్పెషల్ సాంగ్ చేసిన మధు స్నేహని మిస్టర్ ఐటం సాంగ్ కోసం సెలెక్ట్ చేశారట.