రాజమౌళి ఇక హాలీవుడ్ డైరక్టర్..!

బాహుబలి సినిమా ఈ రేంజ్ పాపులారిటీ సంపాదించడానికి హింది మార్కెట్ కూడా తోడవటం అనేది ప్రత్యేకమైన విషయం గా చెప్పుకోవచ్చు. హిందిలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో కరణ్ జోహార్ ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు సినిమా అని కాకుండా డైరెక్ట్ సినిమాగా బాహుబలి బిగినింగ్ ను రిలీజ్ చేసి కలక్షన్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అదే రేంజ్లో పార్ట్-2 ను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

నిన్న జరిగిన బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హిందిలో సినిమాను రిలీజ్ చేస్తున్న దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా అటెండ్ అయ్యారు. మైక్ అందుకోవడమే తాను ఎలాంటి ప్రోగాం అయినా సరే ప్రిపేర్ కాకుండా చేస్తానని కాని ఇక్కడకు అంతా ప్రిపేర్ అయ్యి వచ్చానని అన్నారు. తాను నిలబడ్డ స్టేజ్ ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద స్టేజ్ ఇదని అభివర్ణించారు.

ఇంతటి గొప్ప సినిమాలో తాను కూడా భాగమైనందుకు తన సంతోషం వ్యక్త పరచిన కరణ్ బాహుబలి టీం ను చూసి బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాలని అన్నారు. 1960లో ఆసిఫ్ తీసిన మొఘల్ ఈ ఆజమ్ సినిమా భారతదేశాన్ని ఒక్కటి చేసింది. ఆ తర్వాత 67 ఏళ్లకు బాహుబలి మళ్లీ భాషతో సంబంధం లేకుండా దేశ సినిమాను ఒక్కటి చేసిందని అన్నారు కరణ్.  ఇక రాజమౌళి గురించి చెబుతూ ఇండియాలో రాజమౌళి పెద్ద దర్శకుడు అన్నాడు కేవలం ఇండియాకే కాదు వరల్డ్ మూవీ మేకర్స్.. స్టీవెన్ స్పీల్ బర్గ్,   క్రిస్టోఫర్ నోలాన్, జేమ్స్ క్యామరెన్ లాంటి దర్శకులతో పాటు రాజమౌళి కూడా ఉంటాడని కరణ్ అభిప్రాయపడ్డారు. ఇక సినిమా నిర్మాతలు ప్రసాద్, శోభులు కేవలం సినిమా నిర్మాతలుగా కాక వారియర్స్ గా సినిమా కోసం కష్టపడ్డారని కరణ్ జోహార్ అన్నారు. ఇక ఫైనల్ గా సుమ యాంకరింగ్ గురించి కూడా మీ యాంకరింగ్ సూపర్ అంటూ తన గొప్పతనం చాటుకున్నాడు కరణ్.