హీరోకు ఉండాల్సిన లక్షణాలేవి ప్రభాస్ కు లేవు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో బాహుబలితో అందరికి అర్ధమయ్యింది. నిన్న మొన్నటిదాకా కేవలం ఓ ప్రాంతీయ హీరోగా ఉన్న ప్రభాస్ బాహుబలితో నేషనల్ స్టార్ అయ్యాడు. బాహుబలి మొదటి రెండవ పార్ట్ ల కోసం ఏకంగా తన కెరియర్ లో చాలా ప్రత్యేకమైన ఐదేళ్లు త్యాగం చేశాడు. అందుకే ఇప్పుడు అంతకంత రెట్టింపు క్రేజ్ సంపాదిస్తున్నాడు. 

నిన్న జరిగిన బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీరవాణి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ లో ఏమేం క్వాలిటీస్ ఉన్నాయో మీకు నాకు తెలుసని కాని లేని క్వాలిటీస్ తనకు మాత్రమే తెలుసని.. స్టైల్ కొట్టడం.. మిగతా హీరోల్లా బిల్డప్ ఇవ్వడం లాంటివి ప్రభాస్ కు తెలియదు అది చేతకాదు కూడా అని అన్నారు కీరవాణి. అసలు హీరోకి ఉండాల్సిన లక్షణాలేవి ప్రభాస్ లో లేవని అంటూనే ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పారు కీరవాణి. ఇక ఎవ్వడంట ఎవ్వడంట సాంగ్ రీ కంపోజ్ చేసి రాజమౌళి మీద పాట కట్టిన కీరవాణి జక్కన్నను స్టేజ్ మీద ఏడిపించినంత పని చేశాడు.