రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్నాడు..!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి.. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి బాహుబలి ది బిగినింగ్ దాకా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా స్టార్ హీరో సినిమా రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు రాజమౌళి. బాహుబలితో ప్రపంచమంతా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన జక్కన్న ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతాడు.

కాని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీరవాణి ఇచ్చిన షాక్ కు కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజమౌళి. సినిమాకు సంబందించిన టెక్నికల్ టీం అంతా మాట్లాడుతున్న తరుణంలో సినిమా సంగీత దర్శకుడు కీరవాణి ఎప్పుడు లేనంత జోష్ గా బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం జరిగింది.

ఇక సర్ ప్రైజ్ ఏంటంటే రాజమౌళి గురించి ఎవ్వడంట ఎవ్వడంట సాంగ్ ను కాస్త మార్చి రాజమౌళి మీద పాట రాసి కంపోజ్ చేయించాడు. స్వయంగా ఆయనే రాజమౌళిని స్టేజ్ మీదకు పిలిచిమరి ఆ పాట పాడటంతో రాజమౌళి కన్నీళ్ల పర్యంతమయ్యారు. అక్కడ తను ఏమి మాట్లాడలేని పరిస్థితికి వచ్చాడు. రాజమౌళి సినిమాలన్నిటికి కీరవాణి మ్యూజిక్ అందించడం తెలిసిందే. పెద్దన్న అంటూ రాజమౌళి సంభోదించే కీరవాణి తన కెరియర్ లో ఎన్నో సూపర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు. అన్నిటికంటే బాహుబలి చాలా స్పెషల్. బాహుబలి-2 విశేషాలను చెబుతూ స్పీచ్ ముగించేశారు కీరవాణి.