
కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసి అదే రేంజ్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. బ్రూస్ లీ తర్వాత వచ్చిన ధ్రువ సక్సెస్ రాం చరణ్ కు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక తని ఒరువన్ తర్వాత అదే క్రేజీ కాంబో అనగా జయం రవి, అరవింద్ స్వామిల కాంబినేషన్ లో వచ్చిన సినిమా బోగన్.
కోలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు కాని కలక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. మరోసారి జయం రవి, అరవింద్ స్వామిల మ్యాజిక్ రిపీట్ అయ్యింది. అయితే ప్రస్తుతం బోగన్ ను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈసారి చెర్రి కాకుండా రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాలున్నాయట. బెంగాల్ టైగర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చిన మాస్ మహరాజ్ ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు.
సెట్స్ మీదున్న రెండు సినిమాలు పూర్తి చేశాక బోగన్ రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట రవితేజ. మరి రవితేజతో కూడా అరవింద్ స్వామి చేస్తాడా లేక ఆ రోల్ కోసం వేరే వాళ్లను అడుగుతారా అన్నది చూడాలి.