బాబు బాగా బిజీ ట్రైలర్.. అడల్ట్ కంటెంట్ ఎక్కువైనట్టుందే..!

సపోర్టెడ్ ఆర్టిస్ట్ గా ఉంటూ డైరక్టర్ గా కూడా క్రేజీ సినిమాలు తీస్తున్న అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా బాబు బాగా బిజీ. బాలీవుడ్ అడల్ట్ కంటెంట్ మూవీ హంటర్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో తేజశ్వి, మిస్తి చక్రవర్తి, సుప్రియ, శ్రీముఖి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

అమ్మాయిల అవసరాలు వాసన కనిపెట్టి పట్టేయాలి అన్న డైలాగ్ ను బట్టి చెప్పొచ్చు ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో. అంతేకాదు సినిమాలో హాట్ సీన్స్ కు కొదవలేదనిపిస్తుంది. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. మరి అడల్ట్ కంటెంట్ ఎక్కువైనట్టు అనిపిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.