
శాతకర్ణి సినిమాతో తన వందవ సినిమా ఎలా ఉండాలని ఆశపడ్డాడో అలా ఉండటమే కాదు అదే రేంజ్ సక్సెస్ తో మంచి జోష్ లో కనిపిస్తున్నాడు బాలకృష్ణ. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన శాతకర్ణి మూవీ మంచి హిట్ మూవీగా నిలిచింది. ఆ సినిమా తర్వాత మరి లేట్ చేయకుండానే పూరితో సినిమా షురూ చేశాడు బాలయ్య. మొన్నామధ్య మాటల సందర్భంలో ఎన్.టి.ఆర్ బయోపిక్ చేస్తానని సభాముఖంగా ఎనౌన్స్ చేశారు బాలకృష్ణ.
మొదట ఆ సినిమాను తానే డైరెక్ట్ చేసేద్దామని అనుకున్నా నటన దర్శకత్వం రెండు కష్టమని సీనియర్ డైరక్టర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇప్పటికే కథ మొత్తం పూర్తి చేసుకోగా డైరక్టర్ వేటలో ఉన్నాడట బాలయ్య. ఆ క్రమంలో దాసరి నారాయణ రావు చేత సినిమా చేద్దామనుకుంటే ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో భాధపడుతున్నారు. ఇప్పటికి బెస్ట్ రెస్ట్ తీసుకుంటున్న దాసరి కోలుకుని సినిమా తీయడం ఇప్పుడప్పుడే జరైగేలా కనబడట్లేదు. ఇక దాసరి తర్వాత అంతటి సీనియర్ డైరక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని అడిగారట బాలయ్య బాబు.
గొప్ప చరిత్ర కలిగిన ఎన్.టి.ఆర్ బయోపిక్ తాను తీయలేనని సున్నితంగా బాలకృష్ణ ఆఫర్ ను కాదనేశాడట రాఘవేంద్ర రావు. సీనియర్ డైరక్టర్స్ ఇద్దరు ఈ బయోపిక్ కు అందుబాటులో లేకపోవడం బాలకృష్ణను ఆలోచనలో పడేసిందట. కొత్తవారితో సినిమా తీసే అవకాశం ఉన్నా ఎన్.టి.ఆర్ జీవిత గాధ కాబట్టి ఆలోచిస్తున్నాడట. మరి దీని గురించి ఫైనల్ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.