మహేష్ తో ఢీ కొడుతున్న నాని

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా రివీల్ అవని ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం జూన్ 23 అని ఎనౌన్స్ చేశారు. స్టార్ సినిమా అంటే అటు ఇటు రెండు వారాలు ఎలాంటి సినిమా లేకుండా చూసుకుంటారు. సినిమా హిట్ అయితే మిగతా సినిమాలు వచ్చినా కష్టమనిపించే పరిస్థితి ఉంటుంది.

ఈ క్రమంలో జూన్ 23న మహేష్ మురుగదాస్ సినిమా రిలీజ్ అవుతున్నా దానికి ఓ వారం ముందు నాని తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గా నేను లోకల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో నిన్ను కోరి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో మహేష్ తో ఢీ కొడుతున్నాడు నాని.  

సినిమా సినిమాకు సూపర్ హిట్ అందుకుంటూ స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్న నాని ఈసారి డైరెక్ట్ గా సూపర్ స్టార్ సినిమాకే పోటీగా వస్తున్నాడు. ఓ పక్క మురుగదాస్ తో మహేష్ చేస్తున్న సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. మహేష్ నాని ఫైట్ లో మహేష్ కు అంతగా ఎఫెక్ట్ పడకపోయినా వరుస హిట్లతో హుశారు మీదున్న నాని హిట్ కొడితే దాని ఫలితం మహేష్ సినిమా మీద పడే అవకాశం ఉంటుంది. మరి ఈ రెండు సినిమాల ఫైట్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియాలంటే సినిమాలు వచ్చేదాకా ఆగాల్సిందే.