అప్పట్లో సినిమాకు అక్కడ సూపర్ క్రేజ్..!

శ్రీవిష్ణు, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర నటించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కథ కథలాన్ని ప్రేక్షకులు మెప్పు పొందేలా చేశాయి. ఈ సినిమా ఫలితం బాలీవుడ్ మేకర్స్ ని ఇంప్రెస్ చేసింది. అందుకే సినిమాను అక్కడ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఓ బడా నిర్మాణ సంస్థ ఇప్పటికే నారా రోహిత్ అండ్ టీం నుండి ఈ సినిమా హక్కులను కొనేశారట. సినిమా కథ కూడా ఓ ఉత్తరాది క్రికెటర్ స్పూర్తితోనే కథ రాసుకున్నాడట సాగర్ చంద్ర. సో అక్కడి కథ అక్కడకు రీమేక్ అవుతుండటం విశేషం. ఇక సినిమాలో హీరోలుగా బాలీవుడ్ క్రేజీ హీరోలు నటించే అవకాశాలున్నాయి. బాలీవుడ్ లో ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి అక్కడ హీరోలు ఈ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. శ్రీవిష్ణు, నారా రోహిత్ పాత్రలు ఎవరు చేస్తారో సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అని ఎక్సయిటింగ్ గా ఉన్నారు తెలుగు మేకర్స్.