
టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజ్ అవడం కామనే.. మెగా హీరోల్లో ఈమధ్యనే ఎంట్రా ఇచ్చినా జోష్ ఫుల్ గా ఫ్యాన్స్ ను అలరిస్తున్న సాయి ధరం తేజ్ వరుస సినిమాలు చేస్తున్నాడు కదా మరి అతనెందుకు షార్ట్ ఫిల్మ్ చేస్తాడు అంటే. ఏదైనా కొత్తగా చేయాలంటే అది మెగా హీరోలే చేయాలి. అది వారికే చెల్లుతుంది అనేలా మెగా హీరోలు చేసి చూపిస్తున్నారు. వారి దారిలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చి సుప్రీం స్టార్ గా నిలిచిన సాయి ధరం తేజ్ హీరోగా ఫుల్ క్రేజ్ లో ఉన్నా సరే షార్ట్ మూవీలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు.
సోషల్ మీడియా విసృతంగా పెరిగిన ఈ రోజుల్లో సినిమా అన్నది ఎలా అయినా తీయొచ్చని ప్రూవ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే టాలెంట్ ఉన్న వారు దాన్ని ప్రూవ్ చేసుకునేందుకు షార్ట్ ఫిల్మిస్ తీస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ కు ఓ క్రేజ్ తెచ్చేలా చేస్తూ హీరోగా సూపర్ ఫాంలో ఉన్నా ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించాడు సాయి ధరం తేజ్. కేరింత, మనమంతా సినిమాల్లో నటించిన విశ్వాంత్ హీరోగా చేస్తున్న నేను మీ కళ్యాణ్ షార్ట్ ఫిల్మ్ లో సాయి ధరం తేజ్ గెస్ట్ రోల్ చేశాడు. షార్ట్ ఫిల్మ్ ఎంట్రీతో పాటుగా ఎండింగ్ లో కూడా తేజ్ కనిపిస్తాడట.
ఈ షార్ట్ మూవీకి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ తోనే ఇంప్రెషన్ కొట్టేసిన ఈ షార్ట్ ఫిల్మ్ కచ్చితంగ నెటిజెన్లను ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ అవబోతుంది. మరి తేజ్ నటించిన మొదటి షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో చూడాలి.