
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న గురు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తమిళ హింది భాషల్లో సూపర్ హిట్ అయిన సలా ఖదూస్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా అసలైతే జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఎందుకో కుదరలేదు.
ఇక ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న గురు సెన్సార్ వారి నుండి యు సర్టిఫికెట్ పొందింది. క్లీన్ ఎంటర్టైనర్ గా గురు అలరిస్తుందని అంటున్నారు. వెంకటేష్ రితిక సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా మొన్నటిదాకా ఏప్రిల్ 7న రిలీజ్ అన్నారు కాని రిలీజ్ డేట్ ను కాస్త ముందుకు తీసుకువచ్చారు చిత్ర దర్శక నిర్మాతలు. మార్చ్ 31న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా మిగులుతుందని అంటున్నారు. మరి గురుగా విక్టరీ వెంకటేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.