మరోసారి డబుల్ మ్యాజిక్ తో మెగాస్టార్..!

ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ అదరగొట్టేసిన మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాను కూడా ఫైనల్ చేశాడని తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కనుంది. పదేళ్ల తర్వాత కత్తి రీమేక్ గా ఖైది నంబర్ 150లో చిరు చేసిన డ్యుయెల్ రోల్ మెగా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. 

ఆ స్పూర్తితోనే చేయబోయే 151వ సినిమాలో కూడా మెగాస్టార్ డ్యుయెల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లుక్ కోసం స్కెచ్ లు వేయించి సురేందర్ రెడ్డి అందులో ఒకటి ఫైనల్ చేశారని తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరి మెగాస్టార్ డ్యుయెల్ రోల్ చేయబోయే ఈ 151వ సినిమా కూడా 150వ మూవీలానే సూపర్ హిట్ అయ్యి మెగా స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేయాలని కోరుకుందాం.