ఏప్రిల్ 14న మహేష్ ఆడియో..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జూన్ 23న రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు. సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న మహేష్ మూవీ టైటిల్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఏజెంట్ శివ, అభిమన్యు, మర్మం వంటి టైటిల్స్ వినపడ్డా ఫైనల్ గా సినిమాకు స్పైడర్ టైటిల్ ఫిక్స్ చేశారట. అఫిషియల్ గా ఉగాదిన టైటిల్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సినిమా ఆడియో ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా గురించి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్స్ లీక్ అవ్వకుండా జాగ్రత్తపడిన చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుందట. ఉగాది నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా టీజర్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. భారీ బడ్జెట్ తో క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది.