2.0 డైరక్టర్ చిక్కుల్లో పడ్డాడు..!

క్రేజీ సినిమాలు ప్రెస్టిజియస్ సినిమాలు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షూటింగ్ పూర్తి చేస్తారు. సినిమాకు సంబందించి ఎలాంటి లీకులు జరుగకుండా జాగ్రత్తపడే క్రమంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ప్రస్తుతం రోబో సీక్వల్ గా 2.0 షూటింగ్ కూడా ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోనే షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా నుండి ఎలాంటి సీన్స్ కాని కనీసం ఫోటో కాని లీక్ కాకూడదని శంకర్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

షూటింగ్ లొకేషన్ లో ఓ ఫోటో జర్నలిస్ట్ ఫోటోలు తీస్తుండగా సినిమా అసిస్టెంట్ డైరక్టర్ ఇంకా మిగతా ఇద్దరు చిత్రయూనిట్ సభ్యులు అతనిమీద చేయి చేసుకున్నారట. ఈ విషయం మీద సీరియస్ అయిన మీడియా మిత్రులు కోలీవుడ్ లో నానా రచ్చ చేస్తున్నారు. ఏకంగా సినిమా యూనిట్ మీద కేసు పెట్టడంతో డైరక్టర్ శంకర్ ఫోటో జర్నలిస్ట్ కు సారీ చెప్పడం జరిగింది. అయినా సరే మీడియా వాళ్లు మాత్రం ఇలాంటి దుశ్చర్యలు ఇక భవిష్యత్తులో కూడా జరుగకుండా ఉండేలా కార్యచరణలు చేయాలని చూస్తున్నారు. ఫోటో జర్నలిస్ట్ చేయిచేసుకున్న 2.0 చిత్రయూనిట్ ప్రస్తుతం ఈ గొడవ నుండి బయటపడే మార్గాలను వెతుకుతుంది.