
మెగా హీరో వరుణ్ తేజ్ క్రేజీ డైరక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్. హెబ్భా పటేల్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. లాస్ట్ మంత్ టీజర్ తో ఇంప్రెస్ చేసిన శ్రీనువైట్ల ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ తో కూడా మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. ఓ మంచి కమర్షియల్ యూత్ ఎంటర్టైనర్ సినిమాకు ఏయే అంశాలు కావాలో అవన్ని మిస్టర్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కాబోతుంది. కంచె, లోఫర్ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఉంది. గోపి మోహన్, శ్రీధర్ సీపాన రచన సహకారం అందించిన ఈ సినిమా ట్రైలర్ మాత్రం ప్లెజెంట్ గానే ఉంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
ఆగడు, బ్రూస్ లీ ఫ్లాపుల తర్వాత శ్రీనువైట్ల చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై తను చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమాతో మరోసారి తన ప్రతిభ చాటాలని చూస్తున్న శ్రీనువైట్ల మిస్టర్ హిట్ ట్రాక్ ఎక్కించేస్తాడేమో చూడాలి.