
కెరియర్ దాదాపు ముగిసింది అనుకుంటున్న టైంలో కాజల్ మళ్లీ మంచి ఊపందుకుంది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమయ్యింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా టెంపర్. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఇప్పుడు ఆ సినిమా హింది రీమేక్ లో కూడా అమ్మడే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. రోహిత్ శెట్టి చేస్తున్న ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా కాజల్ నే ఫైనల్ చేశారట. సౌత్ లో సూపర్ ఫాంలో ఉన్న ఈ అమ్మడు ఓ సూపర్ హిట్ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ లో సత్తా చాటనుంది. బాలీవుడ్ క్రేజీ హీరో రణ్ వీర్ సింగ్ తో రొమాన్స్ అంటే కచ్చితంగా అమ్మడు బీ టౌన్ ఆడియెన్స్ దృష్టిలో పడ్డట్టే. లక్కీ ఆఫర్ అందుకున్న కాజల్ ఎలాంటి అవుట్ పుట్ అందుకుంటుందో చూడాలి.