బాలయ్య సినిమాలో సన్ని ఐటం..!

పూరి జగన్నాధ్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకున్నారని టాక్. రీసెంట్ గా మొదటి షెద్యూల్ స్టార్ట్ చేసిన పూరి సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ కోసం సన్ని లియోన్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్ గా పూరి డైరక్షన్ లో రాబోతున్న రోగ్ సినిమా ఆడియోలో సన్ని చేత స్పెషల్ డ్యాన్స్ ఎరేంజ్ చేయించాడు పూరి.

ఆ పరిచయంతోనే బాలయ్య సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారట. సినిమా టైటిల్ గా టపోరి అని పెట్టబోతున్నారట. పూరి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య లుక్.. డైలాగ్స్ అదిరిపోతాయని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ లో సన్ని కూడా చేరిపోయింది కాబట్టి సినిమా రేంజ్ మారిపోయింది.. సెప్టెంబర్ 29న రిలీజ్ అని ఎనౌన్స్ చేసిన పూరి సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు.