ఉయ్యాలవాడలో మెగాస్టార్ లుక్..!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పదేళ్ల తర్వాత కూడా చిరు స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఈ సినిమా మెగాస్టార్ కెరియర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇక లేట్ చేయకుండా తన 151వ సినిమాకు సిద్ధమవుతున్నాడు చిరంజీవి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో రాబోతున్న ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేశారట.   

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ ప్రీ లుక్ రివీల్ అయ్యింది. ప్రస్తుతం ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తుంది. ఈ లుక్ కోసం ఎన్నో స్కెచ్ లు వేసి ఫైనల్ గా చిరు లుక్ ను కన్ఫాం చేశారట. లీక్ అయిన లుక్ మాత్రం అదరగొడుతుంది. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందేమో చూడాలి. 170 ఏళ్ళ క్రితం జరిగిన కథతో రాబోతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తుండటం విశేషం.