రిలీజ్ కు ముందే కాటమరాయుడి లాభాలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మరో రెండు రోజుల్లో థియేటర్ లో సందడి చేయనుంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత వస్తున్న కాటమరాయుడు మీద భారీ అంచనాలే ఉన్నాయి. డాలి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ పబ్లిసిటీతో కలుపుకుని 35 కోట్లలో కంప్లీట్ చేశారట. అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 85 కోట్లు చేసింది. శాటిలైట్ రైట్స్ రీమేక్ రైట్స్ అన్ని కలిపితే సినిమా దాదాపు 105 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టే.

సో ఈ లెక్కన చూస్తే కాటమరాయుడుకి రిలీజ్ కు ముందే 75 కోట్ల లాభం వచ్చేసినట్టే. తమిళ సినిమా వీరం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై ముందు కాస్త నెగటివ్ ప్రచారం జరిగినా జరుగిన బిజినెస్ చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. రిలీజ్ కు ముందే లాభాలు తెచ్చుకున్న కాటమరాయుడు రిలీజ్ తర్వాత కూడా సినిమా కొన్న బయ్యర్లకు అదే రేంజ్ లాభాలను తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.