నితిన్ చేసిన తప్పే నాగార్జున కూడా..!

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ మొదటి సినిమా అంతగా ఆకట్టుకోలేదు. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అఖిల్ గ్రేస్ ఫుల్ ఎనర్జీ పర్వాలేదు అనిపించినా సరే సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు. అయినా సరే ఇచ్చిన పబ్లిసిటీకి 25 కోట్ల దాకా షేర్ రాబట్టింది అఖిల్ సినిమా. ఇక రెండో సినిమా కోసం ఏడాదిన్నర వెయిట్ చేసిన అఖిల్ ఫైనల్ గా విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా షురూ చేశాడు.

అన్నపూర్ణ మూవీస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా 40 కోట్లని అంటున్నారు. అంతేకాదు బడ్జెట్ లో సగానికి పైగా యాక్షన్ పార్ట్ కే ఖర్చు చేస్తున్నారట. విక్రం కుమార్ సినిమా అంటే అంచనాలు బాగానే ఉంటాయి. అయినా సరే మొదటి సినిమా కూడా అలానే అనుకుని ఎక్కువ బడ్జెట్ పెట్టేశారు.. తీరా సినిమా నిరాశ పరచింది. అఖిల్ సినిమా నిర్మాత నితిన్ చేసిన తప్పే ఇప్పుడు నాగార్జున చేస్తున్నట్టు తెలుస్తుంది.

బడ్జెట్ విషయంలో నాగార్జున కట్టుదిట్టంగానే ఉంటాడు. కాని తనయుడి విషయం వచ్చేసరికి పెట్టక తప్పట్లేదు. ఓ విధంగా చెప్పాలంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో వచ్చే భారీ బడ్జెట్ సినిమా ఇదే కావొచ్చు. ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి.