నందమూరి కళ్యాణ్ రామ్ ఇజం తర్వాత ఏ సినిమా కమిట్ అవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇజం ఫ్లాప్ అవడంతో కాస్త టైం తీసుకున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు ఉపేంద్ర డైరక్షన్ లో సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ గా ఎమ్మెల్యే అని పెట్టబోతున్నారట. ఒకానొక దశలో ఈ టైటిల్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయాలని చూశాడు. కాని అది ఎందుకో కుదరలేదు.
ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ ను ఎమ్మెల్యేగా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నందమూరి వారసులు ఇలా ఎమ్మెల్యే టైటిల్ తో సినిమా తీయడం సినిమాకు ఓ రేంజ్ పబ్లిసిటీ వచ్చేసినట్టే. కళ్యాణ్ కెరియర్ లో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకులంతా కొత్తవారే అందుకే మరోసారి కొత్త దర్శకులను నమ్ముతున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.