
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం సినిమాల విషయంలో వెనుకపడ్డాడు. హీరోగా టర్న్ తీసుకున్న టైంలో పూరితో హిట్ అందుకున్న రవితేజ మరోసారి ఇద్దరు కలిసి అదే రేంజ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. బెంగాల్ టైగర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రవితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నాడు.
అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఒకటికాగా.. మరోటి విక్రం సిరి డైరక్షన్ లో వస్తుంది.. ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి పూరి డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట రవితేజ. ఇద్దరు చేసిన సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సంపాదించారు. అందుకే క్రేజీ కాంబోలో మరోసారి ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తుండగా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసుకుని రవితేజ పూరితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చిరు కోసం సిద్ధం చేసిన ఆటోజాని కథతోనే ఈ ఇద్దరి సినిమా వస్తుందని అంటున్నారు.
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే ఇలా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్ అవడంతో ఈ కాంబినేషన్ మీద మరోసారి అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమాపై అఫిషియల్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.