వినాయక్ తో మనోజ్..రూమరేనా..!

ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న వినాయక్ మరోసారి తన డైరక్షన్ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అఖిల్ ఫ్లాప్ తర్వాత అపవాదాలు మూటకట్టుకున్న వినాయక్ ఖైదితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. మెగా డైరక్టర్ తో సినిమా చేయాలని హీరోలంతా ఉత్సాహపడతారు. ఆ క్రమంలో మంచు మనోజ్ కూడా వినాయక్ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట.

రీసెంట్ గా మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వినాయక్ అటెండెన్స్ కూడా దీనికి బలాన్ని చేకూరుస్తుంది. మంచు ఫ్యామిలీ నుండి క్రేజీ హీరోగా మారిన మనోజ్ వినాయక్ తో సినిమా అనగానే మంచు ఫ్యాన్స్ లో కూడా హుశారు వచ్చింది. కాని డైరక్టర్ వినాయక్ ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశాడు. మనోజ్ తో సినిమా మీద వస్తున్న వార్తల పట్ల స్పందించిన వినాయక్ ప్రస్తుతం తాను ఏ సినిమా కమిట్ అవలేదని.. మనోజ్ తో సినిమా చర్చల్లో ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.