
విక్టరీ వెంకటేష్ రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గురు. తమిళ హింది భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సాలా ఖదూస్ సినిమా రీమేక్ గా మాత్రుక దర్శకురాలు సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గురుగా వెంకటేష్ అదరగొట్టాడని చెప్పొచ్చు.. టీజర్ తోనే వెంకటేష్ తన లుక్ తో సర్ ప్రైజ్ ఇవ్వగా ఈ ట్రైలర్ తో మరింత ఆకట్టుకున్నాడు.
సినిమాలో వెంకటేష్ కంప్లీట్ మేకోవర్ కనిపిస్తుంది. కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలకే పరిమితమైన వెంకటేష్ తన రూట్ లోకి వచ్చేశాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బాబు బంగారం కూడా వెంకటేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సినిమా కమర్షియల్ గా ఎంత హిట్ అన్నది పక్కన పెడితే బాబు బంగారంతో తన ఫ్యాన్స్ కు చేరువయ్యాడు వెంకటేష్. ఇక రాబోతున్న గురు కూడా అదే రేంజ్లో అలరిస్తుందని చెప్పొచ్చు.
కోచ్ గా వెంకటేష్ యాటిట్యూడ్ సూపర్ అని చెప్పేయొచ్చు. ఇక నుండి వెంకటేష్ కూడా ఎలాంటి పాత్రలైనా చేయగలడు అని ఈ సినిమా చూశాక అనేస్తారని నమ్మకంగా చెప్పాడు వెంకటేష్. సినిమాలో గురు నేనైనా ఆఫ్ స్క్రీన్ అంతా నడిపించింది డైరక్టర్ సుధ కొంగర అని.. ఇన్నేళ్ల కెరియర్ లో సినిమా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేసింది కచ్చితంగా గురునే అని చెప్పారు వెంకటేష్.