బాలయ్యను 'టపోరి' చేస్తున్న పూరి..!

నందమూరి బాలకృష్ణ శాతకర్ణి సినిమా తర్వాత తన 101వ సినిమాగా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి సినిమాలో హీరోలంతా ఎలా ఉంటారో మనకు తెలుసు.. ఇప్పుడు ఆ విధంగా బాలయ్యను కూడా చూపించబోతున్నాడట పూరి అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ గా టపోరి అన్న టైటిల్ పరిశీలణలో ఉందట. ఇడియట్, పోకిరి, లోఫర్ ఇలాంటి టైటిల్స్ అన్ని పూరి సినిమాలకే ఉంటాయి.

ఇప్పుడు అదే విధంగా బాలయ్య సినిమాకు టపోరి అని పెట్టబోతున్నాడట. బాలకృష్ణ కూడా సినిమా టైటిల్ పట్ల సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో క్రేజీ మూవీగా మారింది. స్టార్స్ గా ఉన్న వారిని తన సినిమాలతో సూపర్ స్టార్స్ గా తీర్చిదిద్దిన పూరి బాలకృష్ణతో చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.