
తెలుగులో లోఫర్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దిశా పటాని. మోడల్ గా గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో పూరి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అమ్మడికి క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన చిన్నది ధోని అన్ టోల్డ్ స్టోరీలో నటించి మెప్పించింది.
జాకీచాన్ తో కూడా జతకట్టిన ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్ వైపే మనసు లాగేస్తుందట. అవకాశం వస్తే తెలుగులో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతుందట దిశా పటాని. ఇప్పటికే రెండు మూడు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ తో అమ్మడు చేసే డేటింగ్ హాట్ టాపిక్ అవుతుంది. ఇక మరో పక్క హాట్ ఫోటో షూట్లతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది దిశా. మరి తెలుగు సినిమాపై మోజు పెంచుకున్న ఈ భామకు ఇక్కడ దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.