జూనియర్ కోసం మహేష్ కథ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. సినిమా టైటిల్ గా జై లవకుశ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ అయిన త్రివిక్రం ఆ తర్వాత తారక్ కోసం సినిమాకు లైన్ చేశాడు. అయితే జూనియర్ ఇమేజ్ కు సరిపోయే కథ రాసేందుకు సిద్ధమవుతున్న త్రివిక్రంకు సరదాగా మహేష్ కోసం రాసుకున్న కథ ప్రస్థావించాడట.     

ఇక మహేష్ కోసం రాసిన కథ మాత్రమే తనకు కావాలని అంటున్నాడట తారక్. మహేష్ ఇమేజ్ కు తగ్గ కథ సిద్ధం చేసుకున్న త్రివిక్రం అది మహేష్ కోసమని చెప్పినా అతని మాట వినకుండా తనకు ఆ కథ నచ్చిందని మనం అదే సినిమా చేస్తున్నామని అంటున్నాడట తారక్. ప్రస్తుతం మహేష్ కూడా మురుగదాస్ తర్వాత కొరటాల శివతో సినిమా కమిట్ అయ్యాడు. ఆ తర్వాత సినిమా ఏమన్నా త్రివిక్రంతో చేసే అవకాశం ఉంది. కాబట్టి మహేష్ కోసం అనుకున్న కథను తారక్ కోసం ఇచ్చేస్తున్నాడట త్రివిక్రం. మరి మహేష్ కథలో తారక్ ఎలా ఉంటాడో అది కూడా త్రివిక్రం లాంటి సక్సెస్ ఫుల్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.