డిక్ లైక్స్ లో కాటమరాయుడు..!

స్టార్ సినిమా అంటే ప్రతిది లెక్కలోకి వస్తుంది.. ఇమేజ్ కు తగ్గ ఫాలోయింగ్ వస్తే ఓకే లేదంటే మాత్రం అదో సంచలనంగా మరుతుంది. ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం సినిమా టీజర్ కు వచ్చిన లైకుల గురించి కన్నా డిస్ లైకుల గురించి కొంతకాలం చర్చ జరిగింది. ఇది కచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ పనే అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. 

ఇక రీసెంట్ గా కాటమరాయుడు ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అయిన ట్రైలర్ వ్యూయర్ కౌంట్ లో పవర్ స్టార్ స్టామినా చూపిస్తున్నా సరే లైకులు డిస్ లైకుల్లో మళ్లీ రచ్చ చేస్తున్నాయి. పవర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేస్తూ లైకుల్లో 1.57 లక్షల లైకులు సాధించగా ఎవరు ఊహించని విధంగా 45 వేలకు పైగా డిస్ లైకులు కూడా వచ్చాయి. సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ ట్రైలర్ కు ఈ రేంజ్ లో డిస్ లైకులు రావడం ఇప్పుడు చర్చానీయాంశం అయ్యింది.    

ఇది కచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ పనే అని తెలిసినా మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రమేయం ఈ డిస్ లైకుల్లో ఉందని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ లో ఇప్పటికే రెండు వర్గాలు కాగా కొత్తగా పుట్టుకొచ్చిన ఈ అల్లు ఫ్యాన్స్ ప్రస్తుతం స్టార్ లెక్కలను మార్చేస్తున్నాయి. మరి ఈ డిస్ లైకులు సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తాయో లేదో చూడాలి. మార్చి 24న రిలీజ్ అవుతున్న కాటమరాయుడు సినిమాలో పవర్ స్టార్ పంచె కట్టుతో న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు.