
తను చేసే ప్రతి సినిమాతో తన జీవితంలో ఏదో ఒకటి తెలుసుకున్నా అని కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. చేసిన ప్రతి సినిమాలో తన మనసుకి నచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ తన ఫ్యాన్స్ ను ఉత్తేజ పరచారు. సుస్వాగతం తన కెరియర్ లో మొదటి హిట్ నెల్లూరులో థియేటర్ ఫంక్షన్ కు రమ్మన్నప్పుడు ఏదో అని వెళ్లానని. కాని అక్కడ 5 కిలోమీటర్లు వెహికల్ పైన తీసుకెళ్లారని.. తాను ఒక పక్క లక్షల మంది మరో పక్క.. ఇన్నాళ్లు చిరంజీవి గారి ఫంక్షన్స్ చూశా.. అభివాదం చేయడానికి భయమేసింది. అందుకే నమస్కారం పెట్టానని అన్నారు. ఇక ఆ సమయంలో తన తండ్రి మాటలు గుర్తుకొచ్చాయని నువ్వు వాళ్లు సమానమే ఇది తలకెక్కించుకుంటే భవిష్యత్ ఉండదని గుర్తుచేసుకున్నారు.
అన్నయ్య చిరంజీవే తన హీరో అని.. తాను హీరోని కాదని అన్నాడు పవన్ కళ్యాణ్. ఖుషి చేస్తున్న టైంలో రిలీజ్ కు ముందు రోజు మదాపూర్ లో ప్రివ్యూ చూశామని అది చూస్తున్న మధ్యలో ఏదో కీడు శంకించిందని.. అయినా సరే దేవుడిని ప్రార్ధిస్తూ నేను చేయాల్సింది చేస్తా నువ్వు చేయాల్సింది చేయమని అడిగానని అన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆరోజు కోల్పోయిన శక్తి గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్న సమయంలో వచ్చిందని అన్నారు. ఎవరి జీవితం వారిదే ఆని.. జీవం ఉన్న జీవం లేని వారందరికి తన నమస్కారం అన్నారు పవన్ కళ్యాణ్. నువ్వు ఎంతటి వాడినవుతా అన్నది ఎదుటివాడు చెప్పినట్టు కాదు నువ్వు అనుకుంటేనే నువ్వు ఎంత వాడివైనా అవుతావని యువతను ఉద్దేశించి సూపర్ స్పీచ్ ఇచ్చాడు పవర్ స్టార్.