
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఫ్యాన్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పవర్ స్టార్ సన్నిహితుడు డైరక్టర్ త్రివిక్రం ఈ కార్యక్రమానికి వచ్చారు. తన మార్క్ స్పీచ్ తో అదరగొట్టే మాటల మాంత్రికుడు త్రివిక్రం నిన్న జరిగిన కాటమరాయుడు ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి పొగడ్తలతో ముంచెత్తారు.
పవన్ కళ్యాణ్ ను ఊరి బయట ఉన్న మర్రి చెట్టు ఎండాకాలం నీడనిస్తుంది.. వర్షాకాలం వర్షపు చినుకులు పడకుండా చేస్తుంది. అలానే పవన్ కూడా చాలామందికి సహాయం చేస్తాడు. వారెవరో చెప్పి వాళ్లను చిన్నవాళ్లను చేయలేను.. ఇక ఒక చేయి చూపిస్తే అరుపులు ఆగిపోతాయి.. ఒక చేయి ఓ వైపు చూపిస్తే అటు ఏముందో అని చూడకుండా లక్షమంది వెళ్లే పవర్ ఉంది. ఆ పవర్ కొంతమందికే ఇస్తాడు దేవుడు అందులో పవన్ ఒకరని చెప్పకనే చెప్పారు త్రివిక్రం.
నలుసంత మంచితనం ఉంటే చాలు అంటారు కాని నిలువెత్తు మంచితనం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ అందుకే ఆయన కోసం మీరంతా వచ్చారు. ఇక చివరగా పవన్ గురించి ఆయనకు నచ్చిన కవి మాటల్ల్లో చెబుతూ.. అంతా కలిపి ఇంతే కావొచ్చు.. కాని తలెత్తి చూస్తే ఓ దేశపు జెండాకు ఉన్న పవర్ ఉంది. ఆయన గొంతు ఒక స్వరం కాదు లక్షల మంది మీ అందరి స్వరం.. ఆయన అడుగు ఒక్క అడుగు కాదు కొన్ని కోట్ల మంది ఒక్క అడుగు.. ఆయన చేసిన సాయం ఒక్కడిది కాదు కొన్ని కోట్ల మంది చేసే సాయం. ఆయన ప్రేమ మీ అందరి అభిమానం ఇంకా కొనసాగించాలని ఆయన చేసే సేవా కార్యక్రమం మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నా అంటూ తన ప్రసంగం ముగించారు త్రివిక్రం.