మహేష్ టైటిల్ 'స్పై'డర్..!

ఎట్టకేలకు మహేష్ మురుగదాస్ మూవీ టైటిల్ సంబందించిన ఫైనల్ టైటిల్ లీక్ అయ్యింది. ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్ పై కన్ ఫ్యూజన్ చివరికి క్లియర్ అయ్యింది. ఉగాదికి టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేస్తామని చెప్పిన మహేష్ అంతకుముందే టైటిల్ రివీల్ చేశారు. ఏజెంట్ శివ, అభిమన్యు, సంభవామి, మర్మం ఇలా రకరకాల టైటిల్స్ బయటకు వచ్చాయి. అయితే ఫైనల్ గా 'స్పైడర్' అన్న దానికి అందరు ఓటేశారట.  

మురుగదాస్ మహేష్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 23న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమాలో స్పైడర్ మేన్ గా కొన్ని సీన్స్ లో కనిపించబోయే మహేష్ టైటిల్ గా స్పైడర్ ని కన్ఫాం చేశారట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ మ్యూజిక్ డైరక్టర్ హరీస్ జైరాజ్ అందిస్తున్నాడు. 80 కోట్ల భరీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.