మెగాస్టార్ 151 స్క్రిప్ట్ రెడీ..!

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అవడంతో మరి లేట్ చేయకుండా తన 151వ సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ముందునుండి అనుకున్నట్టుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో ఈ సినిమా రాబోతుంది. పరుచూరి బ్రదర్స్ కథ అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేశారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ సర్ ప్రైజింగ్ గా ఉంటుందట. 

ఇందుకు సంబంధించిన స్కెచ్ లు ఈమధ్యనే టెస్ట్ చేశారట. ఎన్నాళ్లనుండో ఈ సినిమా మీద మనసు పడ్డ మెగాస్టార్ ఫైనల్ గా సినిమా చేసేందుకు కరెక్ట్ టైం ఇదే అని ఫిక్స్ అయ్యాడు. పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన తన స్టామినా ఇసుమంత కూడా తగ్గలేదని నిరూపించాడు చిరంజీవి. మెగాస్టార్ ఎంట్రీతో మెగా హీరోల్లో కూడా ఉత్సాహం వచ్చింది. మరి సినిమాకు సంబదించిన మిగతా డీటేల్స్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తారట. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.