బాహుబలికి భయపడిన డిజె..!

రాజమౌళి సృష్టించిన బాహుబలి సునామి మిగతా స్టార్ హీరోలకు షివరింగ్ వచ్చేలా చేస్తుంది. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న బాహుబలి-2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని సిని ప్రియులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ అవుతున్న బాహుబలి-2 ఆ తర్వాత వారం రిలీజ్ అవుతున్న డిజెను భయపడేలా చేసింది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే బాహుబలి-2 కూడా ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

అందుకే మే మొదటి వారంలో రిలీజ్ చేయాలనుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాను మే మూడో వారానికి పోస్ట్ పోన్ చేశారట. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రీసెంట్ గా టీజర్ తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న డిజె బన్ని కెరియర్ లో మరో సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.