పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో హీరోయిన్ ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుండడం  తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎన్నికైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇటీవల విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించిన ఫలితం సాధించకపోవడంతో, సినిమా సినిమా కి ఎక్కువ సమయం తీస్కునే పవన్ ఈసారి ఆ పొరపాటు చేయకుండా వెంటనే ఎస్ జె సూర్య సర్శకత్వంలో సినిమా మొదలు పెట్టేశాడు.
పదేళ్ళ పాటు ఫ్లాపులతో నలిగిపోయిన పవన్కు గబ్బర్ సింగ్ ద్వారా ఒక బ్లాక్ బస్టర్ రావడం, ఆ సినిమాలో హీరోయిన్ శృతి కావడంతో, అదే లక్కు మళ్ళీ కలిసొస్తుందనే నమ్మకంతో పవనే శృతి ని ఎన్నుకున్నట్లు సమాచారం.
ఆకుల శివ కథని అందించిన ఈ సినిమాని, సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మించిన శరత్ మర్రారే తన బ్యానర్ నార్త్ స్టార్ ఎంటర్ టెయింమెంట్స్ ద్వారా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.