
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు రెండు ఒక వారం అటు ఇటు ఎలాంటి సినిమా లేకుండా చూసుకుంటారు. పవన్ సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసే కలక్షన్స్ హడావిడి తెలిసిందే. మార్చి 24న పవర్ స్టార్ కాటమరాయుడుగా వస్తుండగా ముందు 29న రిలీజ్ ప్లాన్ చేసిన శర్వానంద్ రాధ మూవీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. కాని హ్యాపీడేస్ రాహుల్ నటిస్తున్న వెంకటాపురం సినిమా మాత్రం రేసులో ఉంది.
క్రైం మిస్టరీతో వస్తున్న వెంకటాపురం సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాహుల్ ఓ డిఫరెంట్ క్యారక్టర్ తో కనిపిస్తున్న ఈ సినిమాను వేణు డైరెక్ట్ చేశారు.శ్రేయాస్ మీడియా నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పవర్ స్టార్ స్టామినా ఏంటో తెలిసి కాటమరాయుడు ముందు నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు రాహుల్. మరి రాహుల్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ వెంకటాపురం అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.