
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. అయితే లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూట్ చేసి సగానికి పైగా నష్టాలు పొందిన వారికి కాటమరాయుడు ఇస్తామని అన్నారు. కాని ఇప్పుడేమో వారికి కాకుండా కొత్త వారికి ఈ సినిమా ఇచ్చారట. దీనికి నిరసనగా సంపత్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు.
సర్దార్ గబ్బర్ సింగ్ కృష్ణ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేసిన తను సినిమాను 5 కోట్లకు కొనగా తనకు 2 కోట్లు మాత్రమే వచ్చాయని.. మిగిలిన మూడు కోట్ల లాస్ కు పవర్ స్టార్ హామీ ఇచ్చాడని అన్నారు. తీరా కాటమరాయుడు రిలీజ్ అవుతుండగా తన మేనేజర్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదని సంపత్ అంటున్నాడు. మరి పవర్ స్టార్ డిస్ట్రిబ్యూటర్ల సమస్యను ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి. మరో పక్క తమ విషయంలో ఓ క్లియరెన్స్ ఇచ్చేదాకా సినిమా రిలీజ్ ఆపేస్తామని నిరసన తెలుపుతున్నారు సర్దార్ డిస్ట్రిబ్యూటర్లు. మరి ఈ విషయంపై పవన్ జోక్యం చేసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకునే బెటర్ లేదంటే జరగాల్సిన నష్టం జరిగిపోయే అవకాశం ఉంది.